కన్నుల పండుగగా జమ్ములమ్మ కళ్యాణం

గద్వాల మండలం జమ్మిచేడులో వెలసిన జమదగ్ని సమేత జమ్ములమ్మ 5వ వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులు ఈ కళ్యాణ క్రతువును అశేష జనవాహిని మధ్య నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.