'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి'

NZB: నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నుడా ఛైర్మన్ కేశ వేణు ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. వారితో కలిసి ఆయన బుధవారం నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ సీఐ పబ్బ ప్రసాద్ తదితరులున్నారు.