VIDEO: యువతలో క్రీడాస్పూర్తి పెంపొందించాలి: ఎమ్మెల్యే
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్–2026 టార్చ్ ర్యాలీని సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా మైదానాల వైపు రావాలని పిలుపునిచ్చి, క్రీడల ద్వారా శారీరక, మానసిక బలం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చని చెప్పారు.