'ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

KMM: ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయాలని CITU జిల్లా కమిటీ సభ్యులు వీరన్న అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట CITU ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల పక్షవాత ధోరణి అవలంబిస్తుందని చెప్పారు. అనంతరం వైద్యాధికారికి వినతి పత్రం అందించారు.