వచ్చే నెల 8వరకూ అవగాహన కార్యక్రమాలు

వచ్చే నెల 8వరకూ అవగాహన కార్యక్రమాలు

ASR: 2024-25 సంవత్సరాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కొయ్యూరు మండలంలో స్వీకరించిన 1,471 ఫిర్యాదుల పరిష్కారానికి గాను వచ్చే నెల 8వ తేదీ వరకు గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తహశీల్దార్ మురళీ బాబు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం కొయ్యూరు, రాజేంద్రపాలెం పంచాయతీల్లో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.