పన్ను ఎగవేతదారులపై నగరపాలక శాఖ చర్యలు

పన్ను ఎగవేతదారులపై నగరపాలక శాఖ చర్యలు

కర్నూలులో భారీ బకాయిదారులపై నగరపాలక అధికారులు కొరడా ఝులిపించారు. అదనపు కమిషనర్ ఆర్వీవి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బకాయిలు ఉన్న సముదాయాలపై సీజ్ చర్యలు ప్రారంభించారు. ముజఫర్ నగర్ సమీపంలోని గోవర్ధన్ నగర్లో భవన యజమాని వై. రాధాకృష్ణ మూర్తి రూ.8,33,761 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఆ వ్యాపార సముదాయాన్ని అధికారులు సీజ్ చేశారు.