పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రకాశం: జరుగుమల్లి మండలంలోని కామేపల్లిలో వెలిసిన పోలేరమ్మ తల్లి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో బైరాగి చౌదరి తెలిపారు.