సర్పంచ్ అభ్యర్థి గెలుపుకై ఎమ్మెల్యే ప్రచారం
WGL: గీసుగొండ మండలం శాయంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గాలి యాకయ్య గెలుపు కోసం పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు మహిళలు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేసిన అభివృద్ధి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి MLA ప్రజలకు వివరించారు.