జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

MBNR: జిల్లాలో గత 10 రోజులుగా వర్షాలు కురవడం తగ్గిపోవడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అడ్డాకులలో 35.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. దేవరకద్ర 34.1, నవాబుపేట 34.0, కోయిలకొండ మండలం పారుపల్లి 33.6, జడ్చర్ల 32.8, బాలానగర్, మిడ్జిల్ 32.6, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.