భారీగా పడిపోయిన టమాట ధరలు

భారీగా పడిపోయిన టమాట ధరలు

అనంతపురం శివారు కక్కలపల్లి మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గాయి. కిలో గరిష్టంగా రూ. 6 పలకగా, కనిష్ట ధర రూ. 3 నుంచి నమోదైంది. మండీకి సుమారు 38 టన్నుల మేర టమాట నిల్వలు వచ్చాయి. దిగుబడి పెరగడం వల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. తక్కువ ధరల వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.