కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌ను అభినందించిన దేవినేని

NTR: ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైన సజ్జ అజయ్ శుక్రవారం నాడు గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి, ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ అభివృద్ధికి తోడ్పాటుగా పనిచేయాలని సూచించారు.