నాటి శైలపురమే.. నేటి సలేశ్వరం

నాటి శైలపురమే.. నేటి సలేశ్వరం

WNP: ఉమ్మడి జిల్లాలోని లింగాల(M) నల్లమలలో దట్టమైన అడివిలో ప్రకృతిసిద్దంగా కొండ గుహలు ఉన్నాయి. పూర్వకాలంలో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం అక్కడే చేసినట్లు స్థల పురాణం చెపుతోంది. పాండవులు ఇబ్బంది పడకుండా ఈ క్షేత్రానికి కృష్ణానది నీటిని శివుడు రప్పించినట్లు చెబుతారు. శివుడు ఇక్కడే తపస్సు చేసినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. ముందుగా సలేశ్వరాన్ని శైలపురంగా పిలిచే వారని తెలుస్తోంది.