సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతి
వనపర్తి పట్టణంలోని 9వ వార్డులో లక్ష్మీనరసింహ కాలనీ రిషి స్కూల్ వెనుక భాగంలో మురికి నీరు నిలువ ఉండటం వల్ల ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత డ్రైనేజ్ లైన్‌ను సాంక్షన్ చేసి నిర్మించాలని బీఆర్ఎస్ నాయకులు కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును వినతి పత్రం అందజేశారు. వార్డు మీటింగ్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.