రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
KRNL: వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామం వద్ద కోతి కట్ట సమీపంలో ఇవాళ ఆటో– బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారు కొసనపల్లి గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.