మేడిపల్లి PS పరిధిలో ఆగని దొంగతనాలు..!
MDCL: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల రోజులుగా దొంగల దోపిడీ కొనసాగుతోంది. హార్డ్వేర్ దుకాణాలు, బంగారం షాపులు మాత్రమే కాకుండా ఇండ్లను సైతం లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల నగదు, బంగారం, విలువైన సామాగ్రి ఎక్కడికక్కడ దోచుకెళ్లినట్లు సమాచారం. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.