చెట్లు తొలగించాలని కమిషనర్‌కు వినతి

KNR: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని మోడల్ చెరువు, గుండ్ల చెరువుల చుట్టూ ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించాలని ప్రజాసంఘాల నాయకుడు మహమ్మద్ ఖలీద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ చెట్లు విషసర్పాలకు ఆవాసంగా మారాయని, ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతూ ఆయన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు.