ప్రారంభమైన HPV వ్యాక్సినేషన్
ATP: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్.పీ.వీ వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు 1,245 మంది 14 ఏళ్ల బాలికలకు టీకాలు వేశారు. తాడిపత్రి ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. బాలికలు వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.