‘మతోన్మాద ఏజెండాకు ఎదురునిలిచిన యోధుడు సీతారాం ఏచూరి’

BHNG: దేశంలో మతోన్మాద ఏజెండాకు ఎదురునిలిచిన యోధుడు సీతారాం ఏచూరి అని CPM ఆలేరు మండల కమిటీ కార్యదర్శి దూపటి వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఏచూరి జయంతిని సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీతారాం ఏచూరి ఒక గొప్ప రాజకీయ, సామాజిక, ఆర్థిక మేధావి అని కొనియాడారు.