'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది'

'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది'

ASR: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచిందని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. పులివెందుల, ఒంటిమెట్ట ఎన్నికల్లో టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు గెలిచిన నేపథ్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు. ఏళ్లుగా పులివెందులలో వైసీపీ ఏకగ్రీవంగా గెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను, ఏకగ్రీవం చేస్తూ ప్రజలను వైసీపీ భయాందోళనకు గురి చేసిందన్నారు.