ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

సత్యసాయి: తనకల్లు మండలం రెడ్డివారిపల్లి తండాలో నూతనంగా నిర్మిస్తున్న తొలిజ భవాని అమ్మవారి ఆలయానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రూ. 2 లక్షల విరాళం అందజేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రెడ్డి భాష ఈ మొత్తాన్ని బుధవారం గ్రామస్తులకు చేరవేశారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ రెడ్డితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.