VIDEO: రాయచోటిలో గైడ్ కెప్టెన్ల శిక్షణ ముగింపు కార్యక్రమం
అన్నమయ్య: రాయచోటిలో 7 రోజుల గైడ్ కెప్టెన్ల బేసిక్ శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల రాష్ట్ర సంచాలకులు దేవానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల్లో సేవాభావం, క్రమశిక్షణ, ధైర్యం, సాహసం వంటివి పెంపొందించడంలో గైడ్ కెప్టెన్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. భవిష్యత్ సమాజ నిర్మాణంలో వారు ఆదర్శంగా నిలవాలని తెలిపారు.