చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: బాటసారుల దాహార్తి తీర్చటం ఆదర్శనీయం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ మండలం పులిగడ్డలో వేసవి దృష్ట్యా ప్రయాణికులు, బాటసారుల కోసం మండలి అభిమానులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే చలివేంద్రం ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమాల వైపు యువత ఆసక్తి చూపటం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.