భవనాల అనుమతులకు క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్

WGL: వరంగల్ నగరంలో భవన నిర్మాణాల కోసం టీజీ- బీ పాస్‌లో దరఖాస్తు చేసుకున్న పలు భవనాలను నేడు నగర మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే స్వయంగా పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న మేరకు కొలతలు ఉన్నాయా లేదా అనే విషయంపై క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కేయూ ప్రాంతంతోపాటు ఆరేపల్లెలో పలుభవనాలకు అధికారులతో కొలతలు వేయించారు. ఈ కార్యక్రమ్ంలో సిటీ ప్లానర్ రవీందర్ పాల్గొన్నారు