'ర్యాగింగ్ చట్టరీత్యా నేరం'
JGL: ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం విద్యార్థులకు ర్యాగింగ్, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. విద్యార్థులు ర్యాగింగ్ వంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడవద్దన్నారు.