చిన్నారులతో ముచ్చటించిన మంత్రి నాదెండ్ల
GNTR: తెనాలి మండలం చినరావూరు 13వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారులతో ముచ్చటించి, సమయానికి భోజనం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే,అంగన్వాడీ టీచర్లతో మాట్లాడి కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.