నిరుపేద యువతి వివాహానికి ఎమ్మెల్యే చేయూత
NRML: జన్నారం మండలానికి చెందిన నిరుపేద యువతి భీమనపెళ్లి నాగలక్ష్మి వివాహానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్, వేడ్మ ఫౌండేషన్ ద్వారా రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయాన్ని అభినందిస్తూ నిరుపేద కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు పటేల్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్లాఉద్దీన్, సల్లు భాయ్, తదితరులు పాల్గొన్నారు.