నూతన కళా వేదికను ప్రారంభించిన ఎంపీడీవో
SKLM: సారవకోట మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో గురువారం నూతన కళావేదికను మండల ఎంపీడీవో కృష్ణమోహన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేందుకు కళా ప్రాంగణం లేక 10 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డారని హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వం చొరవతో నిధులను గ్రాంట్ చేసి మూడు నెలల్లో నిర్మించారన్నారు.