VIDEO: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కమిషనర్
KKD: PGRSలో నమోదైన పిటిషన్‌లు తిరిగి re-open కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను నిర్ణీత సమయానికల్లా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.