VIDEO: రోడ్డుపై ధాన్యం.. ప్రమాదాలకు దారి
MBNR: మిడ్జిల్ మండలం మున్ననూరు టోల్ గేట్ పరిసరాల్లో రైతులు రహదారిపైనే మొక్కజొన్న, ఇతర ధాన్యాలను ఆరబెడుతున్నారు. సూచికలు లేకుండా ధాన్యం కుప్పలు ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు జాగ్రత్తలు పాటించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.