30 ఏళ్లకు ఇంటికి చేరాడు

KRNL: ఎమ్మిగనూరుకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికినప్పటికీ ప్రయోజనం లేదు. అయితే 30 ఏళ్ల తర్వాత నేపాల్ నుంచి ఎమ్మిగనూరులోని సొంత వాళ్లను కలుసుకున్నారు. నేపాల్లో ఆశ్రమ నిర్వాహకులు, ఎమ్మిగనూరులోని వేదాస్ నిరాశ్రయుల వసతి గృహం డైరెక్టర్ సునీల్‌తో వివరాలు తెలుసుకొని సొంత వాళ్లకు అప్పగించారు.