'పల్లెటూరి కుర్రాళ్లను' అభినందించిన ఎస్పీ

'పల్లెటూరి కుర్రాళ్లను' అభినందించిన ఎస్పీ

GDWL: రోడ్డు భద్రతపై 'పల్లెటూరి కుర్రాళ్లు' గ్రూప్ సభ్యులు ఖదీర్, దేవేందర్, హరిప్రసాద్, రాజు, పరుశురాంలు రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను జిల్లా ఎస్పీ టీ.శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వారి చిత్రం వాస్తవానికి దగ్గరగా ఉందని కొనియాడారు. షార్ట్ ఫిల్మ్ చూసిన వారందరూ ట్రిపుల్ రైడింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని తెలిపారు.