‘కుట్టుమిషన్‌ శిక్షణలో కుంభకోణం’

‘కుట్టుమిషన్‌ శిక్షణలో కుంభకోణం’

 AKP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పేరిట రూ.230 కోట్ల కుంభకోణానికి తెరతీసిందని వైసీపీ ఎలమంచిలి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బొడ్డేడ చెల్లయ్యనాయుడు ఆరోపించారు. ఈ మేరుకు బుధవారం మునగపాక ఎంపీడీవోకు వైసీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.