జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: SP
ADB: ఏప్రిల్ 1 నుంచి 30 తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు SP అఖిల్ మహాజన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.