RECORD: శబరిమలకు ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18, 19న కేరళలో పర్యటించనున్నారు. 18న కొట్టాయం చేరుకుని ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీన శబరిమల అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకోనున్నారు. అయితే, అందరి భక్తుల్లా రాష్ట్రపతి కొండపైకి వెళ్తారా? లేదా అత్యవసర అవసరాల రహదారి ద్వారా ఆలయానికి చేరుకుంటారా? అనేది స్పష్టత లేదు. కాగా, శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు.