రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: మనోజ్

రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: మనోజ్

ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని డా.అంబేడ్కర్ భవనంలో ఈ నెల 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ తెలిపారు. గురువారం బౌద్దులతో కలిసి కార్యక్రమ గోడప్రతులను ఆవిష్కరించారు. డా.అంబేడ్కర్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున హాజరై విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.