నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
AKP: అచ్యుతాపురం మార్కెట్ యార్డు నుంచి విద్యుత్ కార్యాలయం వరకు జెసిబితో చేపట్టిన మట్టి రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అనంతరం రోడ్డు పక్కన డ్రైనేజీలను పరిశీలించారు.