గణేష్ నగర్‌లో పగలు సైతం వెలుగుతున్న వీధిలైట్లు..!

MDCL: ఉప్పల్ గణేష్ నగర్ కాలనీలో వీధిలైట్లు పగలు సైతం వెలుగుతున్నాయి. దీంతో కరెంటు వృధా అవటంతో పాటుగా, అవసరం లేని సమయాల్లో వీధిలైట్లు వెలిగేలా ఉంచడం వెనుక నిర్లక్ష్యాన్ని అక్కడి ప్రజలు ప్రశ్నించారు. సాయంత్రం సమయంలో సమయానికి ఒక్కోసారి పలు గల్లీలలో వీధిలైట్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.