VIDEO: సీఎం రేవంత్‌పై తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సమావేశంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 420 హామీలు అమలు చేయకుండా రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తానని మాట్లాడటం సరికాదని, సీఎం జాగ్రత్తగా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.