వెజిటబుల్ ప్రైస్ మానిటరింగ్ సమావేశంలో పాల్గొన్న జేసీ
NDL: జిల్లాలో కూరగాయల ధరలను నియంత్రించి, వినియోగదారులకు న్యాయమైన ధరలు అందించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వెజిటబుల్ ప్రైస్ మానిటరింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, వినియోగదారులపై భారం పడకుండా ధరల నియంత్రణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.