నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గడంతో అధికారులు పూర్తి స్థాయిలో గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.10 అడుగుల నీటిమట్టం ఉంది. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5524 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 55244 క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.