అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: ఎమ్మెల్యే వేగుళ్ల

అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: ఎమ్మెల్యే వేగుళ్ల

కోనసీమ: మండపేట మండలం కేశవరం గ్రామంలో ఉన్న శ్రీ బుచ్చి పాపమ్మ పేరంటాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.