'తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు'
SRPT: హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో ప్రజలకు వేసవిలో తాగునీటి సరఫరా విషయంలో అంతరాయాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. కౌన్సిల్ సమావేశంలో వార్డ్ కౌన్సిలర్స్ ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని.. ప్రధానంగా వేసవిలో తాగునీటి సరఫరా విషయంలో అంతరాయాలు లేకుండా చూడాలని కోరారు.