కళాభారతిలో నేడు తెలుగు అకాడమీ కార్యక్రమం
VSP: నగరంలోని పిఠాపురం కాలనీలో ఉన్న కళాభారతి ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం 6:30 గంటలకు తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.