చోరీ కేసులో మహిళ అరెస్ట్: ఎస్సై

చోరీ కేసులో మహిళ అరెస్ట్: ఎస్సై

KMM: తిరుమలాయపాలెంలో మే నెలలో జరిగిన దొంగతనం కేసులో మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. దొంగతనం ఘటన‌పై రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా దొంగతనానికి పాల్పడ్డ మహిళను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు. మహిళ నుంచి రూ.లక్ష విలువగల బంగారం వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు.