రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ఎమ్మెల్యే ఆగ్రహం
AKP: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ రైస్ మిల్లు వద్ద అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం సమాచారాన్ని శనివారం జనసేన నాయకులు ఎమ్మెల్యేకు అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి యజమానిని నిలదీశారు. దీనిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.