గాలాయగూడెం మాజీ సర్పంచ్ మృతి

గాలాయగూడెం మాజీ సర్పంచ్ మృతి

ELR: దెందులూరు మండలం గాలాయగూడెం మాజీ సర్పంచ్ పల్లి సాంబశివరావు (50) సోమవారం మృతి చెందారు. ఒంగోలు జిల్లా అద్దంకి సమీపంలో మూడు రోజుల క్రితం జరిగిన రహదారి ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. సాంబశివరావు మృతి పై పలువురు సంతాపం తెలిపారు.