అమ్మాపురం ఉప సర్పంచ్‌గా సిరిపాటి విశాల్
MHBD: తొర్రూరు మండల వ్యాప్తంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అమ్మాపురం గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన ముద్ధం సునీత వీరారెడ్డి గెలుపొందారు. 12 వార్డు స్థానాలకు మూడు సీపీఎం, మూడు బీజేపీ, ఐదు బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ బలపరిచిన ఆరవ వార్డు సభ్యుడు సిరిపాటి విశాల్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.