ట్రాన్స్‌ఫార్మర్ల తొలగింపునకు కాలనీవాసుల వినతి
SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రోడ్ల మధ్యన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే తొలగించాలని కాలనీవాసులు కోరారు. ఈరోజు ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఏఈ రాంప్రసాద్‌కు సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన విద్యుత్ సిబ్బంది చుట్టూ ఉన్న చెట్లను శుభ్రం చేశారు. చంద్రమౌళి, లైన్మెన్ పవన్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.