నాగోల్ మెట్రో స్టేషన్.. గుర్తుతెలియని వ్యక్తి మృతి..!

HYD: నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన 35-40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి స్పృహలేని స్థితిలో పోలీసులకు కనిపించాడు. అతన్ని 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వడదెబ్బ, అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.