బైక్ చోరీ కేసులో యువకుడు అరెస్ట్
NLR: బోగోలు మండలానికి చెందిన సునీల్ (26)ను సోమవారం బైక్ దొంగతనం కేసులో సోమవారం అరెస్ట్ చేశారు. గత నెలలో సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన బీచ్ ఫెస్టివల్ సమయంలో బైక్ చోరీ జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సునీల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.